మండల స్థాయి సమీక్ష సమావేశం

05-11-2026 | 06:47pm

వెంకటాపురం నూగూరు నవంబర్ 5 విజయ క్రాంతి: వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో(Venkatapuram Mandal Parishad Office) మండల స్థాయి సమీక్ష సమావేశం మండల ప్రత్యేక అధికారి డి. సంజీవరావు(Special Officer D. Sanjeeva Rao)  అధ్యక్షతన గురువారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, ఏలినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం, మంచినీటి సరఫరాను మెరుగుపరచడం, పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవడం, వి.బి.జి. రామ్ జీ పథకం ద్వారా ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి ప్రజల వలసలను అరికట్టాలని తెలిపారు.

అదేవిధంగా స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించడం, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి చేనుకు పంట కుంట, ప్రతి గ్రామానికి ఊట కుంట ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటిని సమర్థవంతంగా సంరక్షించి భూగర్భ జలమట్టాలను పెంపొందించడం ద్వారా వ్యవసాయానికి, గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి  బొగ్గ నారాయణ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు