రాష్ట్రంలో కరీంనగర్‌ ను అగ్రస్థానంలో నిలుపుతాం

14-10-2026 | 04:10pm

మేయర్ కొలగాని శ్రీనివాస్. 

ముకరంపుర, అక్టోబర్ 14(విజయ క్రాంతి):విలీన గ్రామాలు శివారు ప్రాంతాల డివిజన్ల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థను తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతామని పేర్కొన్నారు.

అభివృద్ధి లో భాగంగా బుధవారం 21 వ డివిజన్ లో పర్యటించి శ్రీరాంనగర్ కాలనీలో స్థానిక కార్పోరేటర్ వరాల నర్సింగంతో కలిసి రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమీ పూజ చేసి అనంతరం డివిజన్ లో స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన పనులను వేగవంతంగా  నాణ్యత తో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తమ పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. 21 వ డివిజన్ లో అత్యధికంగా దాదాపు 6 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. స్థానిక ప్రజల పార్కింగ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మల్టీ స్కై వాక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణం చేపట్టి తెలంగాణ రాష్ట్రం లోనే కరీంనగర్ నగరపాలక సంస్థ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కర్రె అనిల్, ఇంజనీరింగ్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు