మధ్యాహ్నం సేవలు బంద్...

14-10-2026 | 05:08pm

- రైతుల ఇబ్బందులు...

- మధ్యాహ్నం తర్వాత ప్రైవేట్ కే...

తాడ్వాయి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం గ్రామస్థాయిలో సైతం పశువైద్య కేంద్రాలు నెలకొల్పింది. కానీ సదరు అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామంలో ప్రాథమిక పశు వైద్య కేంద్రం ఉంది.

ఇక్కడ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కేంద్రం పనిచేయాల్సి ఉంది. కానీ సదరు పశు వైద్యులు ఉదయం పశువైద్య కేంద్రాన్ని తెరిచి మధ్యాహ్నానికి తాళం వేసి వెళ్ళిపోతున్నారు. బుధవారం ప్రాథమిక పశువైద్య కేంద్రానికి మధ్యాహ్నమే తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తమ పశువులకు మధ్యాహ్న సమయంలో ఏదైనా వ్యాధులు వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.

మధ్యాహ్నం పశు వైద్య కేంద్రంలో వైద్యులు ఉండకపోవడంతో ప్రైవేట్ వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు.కన్కల్ గ్రామంలో ఉన్న పశు వైద్య కేంద్రం సైతం మధ్యాహ్నానికే తాళం వేసి ఉంది. మధ్యాహ్నం వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో గోపాల మిత్రులతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు తెలిపారు. గోపాల మిత్రులకు డబ్బులు ఇచ్చి ప్రైవేట్ వైద్యం చేయించుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతిరోజు సాయంత్రం వరకు పశువైద్య కేంద్రాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు