రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

14-10-2026 | 05:06pm

కొత్తగూడెం అక్టోబర్ 14 విజయ క్రాంతి: జిల్లాలోని ప్రతి పోలింగ్ స్టేషన్‌లో (Polling station) ఎన్నికల అధికారి (Election Officer)ఆదేశాల మేరకు ,ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఈనెల 15 ,16 తేదీలలో నిర్వహించబడనున్నాయి. ఈ శిబిరాల సందర్భంగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు, (BLOలు) తమ తమ పోలింగ్ స్టేషన్లలో ప్రజలకు అందుబాటులో ఉంటారని.

ప్రజలందరూ ఈ సదా అవకాశాన్ని వినియోగించుకొని, తమ ఓటు వివరాలు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ,ఓటరు జాబితాలో తమ పేరు నమోదు కానివారు **ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతీ యువకులు ,కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ సమీపంలోని పోలింగ్ స్టేషన్‌లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకొని, ఓటరు జాబితాలో తమ పేరు నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేయడమైనది.

మరిన్ని వార్తలు