మేదరిపేటలో రైతు క్షేత్ర పాఠశాల
14-10-2026 | 05:14pm
దండేపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో బుధవారం 'రైతు క్షేత్ర పాఠశాల' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వరిలో వివిధ రకాల చీడపీడల యాజమాన్య పద్ధతులపై మండల వ్యవసాయ అధికారి(MAO) ఆర్ శ్రీకాంత్(Srikanth) వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలను ఆశిస్తున్నటువంటి మొగి పురుగు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు, కంకినల్లి, పాముపొడ తెగులుకు సంబంధించి రైతులతో చర్చించి వారికి తగు సలహాలు, సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులుపాల్గొన్నారు.