బ్లూ డ్రమ్ము హత్య కేసులో సంచలన తీర్పు

14-10-2026 | 05:16pm

సౌరభ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ముస్కాన్, సాహిల్‌కు ఉరిశిక్ష!

ఉత్తర ప్రదేశ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు(Meerut Blue Drum Murder Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు(Saurabh Rajput Murder Case)లో దోషులుగా తేలిన ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలకు మీరట్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ హత్య కేసు దర్యాప్తు దశ నుంచే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

సౌరభ్ హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్‌(Blue Drum)లో దాచినట్లు దర్యాప్తులో వెల్లడైన అంశాలు కేసును మరింత సంచలనంగా మార్చాయి. సుదీర్ఘ విచారణ అనంతరం సెప్టెంబర్ 30న ఇద్దరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. తాజాగా అక్టోబర్ 14న శిక్షను ఖరారు చేస్తూ మరణశిక్ష విధించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బ్లూ డ్రమ్ కేసులో మరో కీలక ఘట్టం ముగిసింది.

మరిన్ని వార్తలు