కాళోజి నారాయణరావుకు ఘన నివాళులు
కరీంనగర్ సిటీ, నవంబరు 13 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణరావు(Kaloji Narayana Rao) 24వ వర్ధంతి సందర్భంగా నగరంలోని 19వ డివిజన్ కాళోజి నగర్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి–కృష్ణ గౌడ్ కాళోజి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, గాజే శివ, ఎన్నం ప్రకాష్, కాళోజి నగర్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేందర్ రెడ్డి, జంపయ్య, గౌడ సంఘం సభ్యులు, ముదిరాజ్ సంఘం సభ్యులు. యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.