ప్రజల సౌకర్యార్థం జేసీబీ, ల్యాడర్ కొనుగోలు

14-10-2026 | 04:34pm

ముకరంపుర, అక్టోబర్ 14(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ(Karimnagar Municipal Corporation) ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు మరియు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సుమారు కోటి రూపాయల వ్యయంతో కొత్తగా జేసీబీ మరియు ల్యాడర్‌ను కొనుగోలు చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి నూతన వాహనాలకు పూజలు నిర్వహించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో కొత్తగా విలీనమైన గ్రామాల్లో విస్తీర్ణం పెరగడం మరియు డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉండటంతో, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయలతో జేసీబీ మరియు ల్యాడర్‌ను కొనుగోలు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు