మొదటి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలి
నిజాంసాగర్ నవంబర్ 13( విజయ క్రాంతి ): నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project) ద్వారా మొదటి ఆయకట్టు రైతులకు ఆరుతడి పంటలకు నీటిని అందించాలని మండల ప్రత్యేక అధికారి కుటుంబరావుకు శుక్రవారం నాడు అచ్చంపేట సాగర సంగ(Achampet Sagara Sanga) అధ్యక్షులు పట్లోళ్ల జనార్దన్ రెడ్డి వినతి పత్రాన్ని అందించారు.
ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని డిస్ట్రిబ్యూటరీలో కాలువల లీకేజీని పూర్తిగా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని లీకేజ్ నీటిని అరికడితే ఆరుతోటి పంటలతో పాటు గ్రామాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని దీని దృష్టిలో ఉంచుకొని నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొద్దిగా వెళ్తున్న లీకేజీ నీటిని అలాగే ఉంచాలని వారు కోరారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.