కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలి

13-11-2026 | 06:18pm
  1. దళితబంధు అక్రమాలపై సమాధానం
  2. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ల కృష్ణారావు

కోదాడ నవంబర్ 13(విజయ క్రాంతి): రైతుల సమస్యలపై(Farmers' problems) మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ(Political) పబ్బం గడుపుకోవడం మానుకోవాలని, రైతుల సంక్షేమం గురించి మాట్లాడే ముందు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కోదాడ నియోజకవర్గంలో దళితబంధు పథకం(Dalit Bandhu Scheme) అమలులో జరిగిన అక్రమాలు, అవకతవకలు,

అర్హులైన దళితులకు జరిగిన అన్యాయంపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ల కృష్ణారావు డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బొల్లం మల్లయ్య యాదవ్ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రజాస్వామ్యంలో తప్పు కాదని, అయితే రైతుల కష్టాలను రాజకీయ విమర్శలకు అస్త్రాలుగా మలుచుకోవడం, ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం మాజీ ఎమ్మెల్యే స్థాయికి తగదని హితవు పలికారు. రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే గతంలో అధికారంలో ఉన్న సమయంలో రైతుల కోసం ఏం చేశారు? వారి సమస్యలను ఎంతవరకు పరిష్కరించారు?

అమలు చేసిన పథకాల ద్వారా ఎంతమందికి ప్రయోజనం చేకూర్చారు? అనే విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు సమయంలో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగిందా?

రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను తెలుసుకున్న ప్రజలే ఇలాంటి విమర్శలకు తగిన సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు