పివి హైస్కూల్ లో ఘనంగా మాతృ వందనం

13-11-2026 | 06:26pm

మేడ్చల్ అర్బన్ నవంబర్ 13(విజయక్రాంతి):మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్(Medchal Municipal Corporation) పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలోని పీవీ హైస్కూల్9PV High School) లో భారతీయ సంస్కృతి,సంప్రదాయాలు,కుటుంబ విలువలను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో మాతృ వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.దీపారాధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లి తండ్రుల పట్ల ప్రేమ,గౌరవం కృతజ్ఞభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంసిటిఎఫ్ కన్వీనర్ ఆర్ రామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు తల్లితండ్రులను గౌరవిస్తూ,మంచి నడవడిక,నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు.అనంతరం పాఠశాల డైరెక్టర్ రేస్వర్ రెడ్డి మాట్లాడుతూ విలువల ప్రాధాన్యత ను వివరించారు"విలువల నిర్మాణమే దేశ నిర్మాణం"అనే సందేశంతో నిర్వహించిన కార్యక్రమంలో మాతృమూర్తులు భావోద్వేగానికి లోనయ్యి పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లు.ఉపాధ్యాయులు.విద్యార్థిని విద్యార్థులు.తల్లి తండ్రులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు