ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి
తూప్రాన్ నవంబర్ 13, (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతరపల్లి గ్రామానికి(Datarapalli Village) చెందిన మామిండ్ల నర్సింలు 48 గత కొంతకాలంగా నూతన ఇంటి నిర్మాణం(Construction of a new house) కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన చాలీచాలని కూలితో నూతన ఇల్లు నిర్మాణం చేయలేకపోతున్నానని ఇంట్లో పదేపదే గుర్తు చేసుకొని మనస్థాపానికి గురైయ్యేవాడనీ మృతుని కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం గురువారం సాయంత్రం మా నాన్న బాధతో ఇంట్లో నుండి పొలం వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో కుమారుడు శ్రీకాంత్ పొలం వద్ద పందుల కావలికి వెళ్లాడు. ఇంతలో నమిలినారు చెట్టుకు ఉరివేసుకున్న తన తండ్రిని వెళ్లి చూడగా అప్పటికి తన తండ్రి చనిపోయాడని నిర్ధారణ చేసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో తూప్రాన్ పోలీసులు అక్కడికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ. యాదగిరి తెలిపారు.