ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు
మంథని, నవంబర్ 13(విజయక్రాంతి) : మంథని పట్టణంలోని(Manthani town) అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ జన్మదిన వేడుకలను శుక్రవారం బీజేపీ శ్రేణులు(BJP ranks) ఘనంగా నిర్వహించారు. బీజేపీ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి(Chandrupatla Sunil Reddy) ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు బోయిని నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా బోయిని నారాయణ మాట్లాడుతూ, మంథని నియోజకవర్గంలో బీసీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని, రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని, బీజేపీ ద్వారానే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలో బీసీలు అంతా బీజేపీ వెంట కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, మంథని నియోజకవర్గ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, ఓబీసీ మోర్చా మంథని మండల అధ్యక్షులు రేపాక శంకర్, ఓబీసీ మోర్చా మంథని పట్టణ అధ్యక్షులు గుడ్ల గురువేష్, బీజేపీ మాజీ మంథని పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, చిలువేరి సతీష్, బీజేపీ పట్టణ కార్యదర్శి సామల అశోక్, ఆయింటి మల్లేష్, మియాపురం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.