యస్ ఆర్ ఆర్ కళాశాలలో పి. జి కోర్సు లకు స్పాట్ అడ్మిషన్స్

03-11-2026 | 03:15pm

ముకరంపుర, నవంబర్ 3(విజయ క్రాంతి): యస్ ఆర్ ఆర్ కళాశాలలో(SRR College) 2026-27 విద్యా సంవత్సరానికి  వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్  కోర్స్ లలో (Various postgraduate courses)అడ్మిషన్ ల కొరకు  స్పాట్ ప్రవేశాలలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె రామకృష్ణ ,పి.జి కోఆర్డినేటర్ మధు రాజేశ్ లు ఒక ప్రకటనలో తెలియజేసారు.

ఎం.ఎ ఆంగ్లం,తెలుగు,ఎకనామిక్స్ ఎం కామ్,ఎం యస్సి బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్,మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ,మైక్రోబయోలాజీ సబ్జెక్టు లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.ప్రవేశాలు పొందాలనుకునే వారు దరఖాస్తులను కళాశాల కార్యాలయములో ఈ నెల 5 వ తేదీ సాయంత్రము 5 గంటల లోపు సమర్పించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు