పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
జమ్మికుంట మండలంలో రూ.8 లక్షల విలువైన 17 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
హుజురాబాద్, అక్టోబర్ 15: (విజయక్రాంతి): కష్టకాలంలో పేదలకు అండగా నిలిచి ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ(Congress People's Government) లక్ష్యమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.
గురువారం మన ఊరు–మన కాంగ్రెస్–మన ప్రణవ్ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.8 లక్షల విలువైన 17 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి, ప్రణవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను వొడితల ప్రణవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.