యువతి మరణానికి కారణమైన వ్యక్తి అరెస్ట్...
కరీంనగర్ క్రైం, నవంబర్3 (విజయక్రాంతి): కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో(Satavahana University) న్యాయవిద్య ద్వితీయ సంవత్సరం చదువుతున్న చంద్రకళ ఆదివారం హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన కొత్తపల్లి పోలీసులు యువతి మృతికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మృతురాలు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన గజ్జల హరికృష్ణ అను అతనితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తర్వాత కాలంలో హరికృష్ణ చంద్రకళను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు శారీరకంగాను దగ్గరయ్యాడు. కొద్ది రోజుల తర్వాత నేను పెళ్లి చేసుకోనని నువ్వు చస్తే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చంద్రకళను శారీరకంగాను మానసికంగాను బాధపెట్టి ఆత్మహత్య చేసుకునేలా పురమాయించాడు.
దాంతో చంద్రకళ (30)అదేరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారణమైన నిందితుని పై కేసునమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించామని కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.