హైదరాబాద్‌కు వెళ్లే వైద్య ఖర్చులకు చెక్

20-11-2026 | 08:13pm

శుశ్రుత పాలిక్లినిక్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు

 గజ్వేల్, నవంబర్ 20 : సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను(Super-specialty medical services) గజ్వేల్ ప్రజలకు చేరువ చేయడం అభినందనీయమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. గజ్వేల్– ప్రజ్ఞాపూర్‌లో(Gajwel-Pragnyapur) నూతనంగా ఏర్పాటు చేసిన శుశ్రుత పాలిక్లినిక్ అండ్ మెడికల్ హాల్‌ను(Shusruta Polyclinic and Medical Hall) ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, క్యాన్సర్ వైద్యం(Cancer Treatment), నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, సైకియాట్రీ, ఎండోక్రైనాలజీ తదితర విభాగాల వైద్య సేవల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి రావడంతో రోగులపై ప్రయాణ ఖర్చులతో పాటు ఆర్థిక భారం పడుతోందన్నారు.

స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుకొచ్చిన శుశ్రుత పాలిక్లినిక్ యాజమాన్యాన్ని అభినందించారు. పేద, నిరుపేద రోగుల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, పట్టణాధ్యక్షుడు మనోహర్ యాదవ్, మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్,డాక్టర్ ఆకుల నరేష్ బాబు,  నాయకులు అరవింద్,  పాలిక్లినిక్ మేనేజ్‌మెంట్ సభ్యులు కాశమైన సందీప్ కుమార్, గొడుగు రాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు