కార్తీక పౌర్ణమికి భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు
ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి(Karthika Pournami)ని పురస్కరించుకొని మంగళవారం ఖమ్మంలోని శైవ క్షేత్రాలు, వివిధ దేవాలయాలు భక్తులతో కిక్క్కరిసాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలు, వివిధ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులు హర హర మహాదేవ శంభో శంకర అంటూ, ఒత్తులను వెలిగించారు. ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని, ఎంతో భక్తి శ్రద్ధలతో వారు తయారుచేసిన 365 ఒత్తులను వెలిగించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీలు ప్రత్యేక క్యూ లైన్లు, ఒత్తులను వెలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ని ఆలయాల్లో పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.