సర్వేయర్లకు కిట్లను పంపిణీ చేసిన సర్పంచ్..
గోవిందరావుపేట, నవంబర్ 24 (విజయక్రాంతి): భూభారతి చట్టం అమలులో భాగంగా మండలంలోని మచ్చాపురం గ్రామం స్పెషల్ ప్యాకేజీ కింద ఎంపిక కావడంతో లైసెన్సుడ్ సర్వే అధికారులు క్రమం తప్పకుండా విధులకు హాజరై భూమి సర్వే చేయడం జరుగుతుంది. విధి నిర్వహణలో భాగంగా భూమిసర్వే చేస్తున్న క్రమంలో పంట పొలాలలో విష సర్పాలు, విష కీటకాలు ఎదురవడం జరిగింది.
విషయం తెలుసుకున్న మచ్చాపూర్ సర్పంచ్ జంపాల ప్రభాకర్(Sarpanch Jampala Prabhakar) విధి నిర్వహణ కోసం వచ్చిన అధికారుల యోగక్షేమాలు కూడా నాకు ముఖ్యమే అని మంచి మనసుతో భావించి వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్వే అధికారుల రక్షణ కోసం సర్వే కిట్ (షూస్, డిజిటల్ వాచ్, క్యాప్, డైరీ, బ్యాగ్) ఇవ్వడం జరిగింది. సర్వేయర్ ల రక్షణ కోసం సర్వే కిట్లు ఇచ్చినందుకు సర్వే అధికారులైన రాజ మనోహర్, భరత్ కుమార్, సతీష్ సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు.