నరసింహపురం గ్రామంలో వైద్య శిబిరం
15-10-2026 | 04:55pm
ఎర్రుపాలెం అక్టోబర్ 15 (విజయ క్రాంతి): నరసింహపురం గ్రామంలో నవ శకం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని సర్పంచ్ శీలం రామకోటరెడ్డి ప్రారంభించారు. గ్రామపంచాయతీ కార్యాలయం(Gram Panchayat Office) నందు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా మందులను అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జోగయ్య , గ్రామ పెద్దలు నాగన బోయిన కాలేశ్వరరావు , లక్ష్మారెడ్డి, పాలకవర్గ సభ్యులు మరియు పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు.