ఎల్ నినో పరిస్థితులను రాజకీయం చేయడం దురదృష్టకరం
ఎమ్మెల్యే రాగమయి
రైతు సమస్యను పరిష్కరించాలి కానీ..
వాతావరణ పరిస్థితులు రాజకీయం చేయొద్దు
సత్తుపల్లి అక్టోబర్16( విజయక్రాంతి ) : రైతు రాజ్యం మనది రైతుకు భరోసా(Assurance to the farmer) ఇచ్చి రైతుని అభివృద్ధి చేయాలి గాని రైతుకు వాతావరణ పరిస్థితుల్లో గలిగే ఇబ్బందులను రాజకీయం చేయొద్దని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(Matta Ragamayi Dayanand) అన్నారు. బి ఆర్ ఎస్ నాయకులు ఎల్ నినో ప్రభావంతో(Impact of El Nino) తెలంగాణలో వర్షపాతం తగ్గిన పరిస్థితులను కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం సరికాదు అని, వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడే సమస్యలను ప్రభుత్వ వైఫల్యాలుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం?
1951 నుంచి 2026 వరకు దేశంలో ఇలాంటి పరిస్థితులు 16 సార్లు ఎదురైనట్లు ఆమె తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు ప్రభుత్వాల చేతుల్లో ఉండవు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవడం, వారికి భరోసా కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.ఈ కష్టకాలంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బి ఆర్ ఎస్ రైతన్నలకు ధైర్యం చెప్పాల్సింది పోయి, ప్రతి సమస్యకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా చేయడం ఎంతవరకు సమంజసం?కేసీఆర్ హయాంలో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు, ఆ విపత్కర పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని విమర్శించిందా? ప్రకృతి, వాతావరణ పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం లేదా?
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యతే. అదే సమయంలో, ప్రకృతి పరిస్థితులను కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు.రాజకీయాలు చేయాల్సిన అంశాలపై రాజకీయాలు చేయండి. కానీ ప్రతి విషయాన్నీ రాజకీయం చేయకండి!ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో విమర్శలకే పరిమితమైతే ప్రజల్లో చులకనయ్యే ప్రమాదం ఉంది.రైతులకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు… ధైర్యం, భరోసా, పరిష్కారాలు ఇకనైనా విమర్శించేటప్పుడు ఆత్మ విమర్శన చేసుకోవాలని సూచించారు.