ఎన్సీపీ జాతీయ కార్యాలయానికి ముద్దిశెట్టి సామెల్
సత్తుపల్లి. ఆగస్టు 16. ( విజయ క్రాంతి): ఎన్సీపీ పార్టీ ఎన్వైసీ నేషనల్ కౌన్సిల్ మెంబర్(NYC National Council Member) మద్దిశెట్టి సామెల్కి ఈ నెల 21వ తేదీన ముంబైలోని ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయానికి హాజరు కావాలని జాతీయ కార్యాలయ ఇన్‌చార్జి ప్రశాంత్ సమాచారం అందించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా కీలకమైన అంశాలపై చర్చించేందుకు మద్దిశెట్టి సామెల్ ని ముంబైకి ఆహ్వానించినట్లు తెలిపారు.
అదేవిధంగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాలు, సంస్థాగత కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై జాతీయ కార్యాలయంలో ముఖ్యమైన చర్చలు జరగనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రాల వారీగా పార్టీ కార్యకలాపాలు, నాయకులు మరియు కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై జాతీయ నాయకత్వంతో మద్దిశెట్టి సామెల్ గారు చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ముంబైలోని ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయానికి మద్దిశెట్టి సామెల్ హాజరుకానున్నారు.