చిన్నారులను పంపండి

28-09-2026 | 03:43pm

చండ్రుపట్ల,(విజయక్రాంతి): చండ్రుపట్ల సెక్టార్ పరిధిలోని యజ్ఞనారాయణపురం గ్రామ పంచాయతీ(Yagnanarayanapuram Gram Panchayat) పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమవారం పోషణ మాసోత్సవాల(Poshan maasotsavam)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. చిన్నారులను క్రమం తప్పకుండా అంగన్‌వాడీ(Anganwadi) కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపసర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ... అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఆరోగ్యలక్ష్మి భోజనం, పౌష్టికాహారం ప్రతి లబ్ధిదారుడికి సక్రమంగా అందేలా అందరూ సహకరించాలని కోరారు. రక్తహీనత నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. చిన్నారులను ప్రీ-స్కూల్‌కు పంపించడం ద్వారా చిన్న వయసు నుంచే నాణ్యమైన విద్యకు పునాది వేయవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. కార్యక్రమంలో సెక్టార్ సూపర్‌వైజర్ సుజాత, అంగన్‌వాడీ టీచర్లు కరుణ, నిర్మలజ్యోతి, ఆశా కార్యకర్తలు, ఆయాలు, తల్లులు, చిన్నారులు, గ్రామదీపికలు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు