‘నిశముక్త్’ ర్యాలీ

28-09-2026 | 03:56pm

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: విద్యార్థుల నినాదాలు

దోమకొండ, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే అవగాహన కల్పించేందుకు దోమకొండ(Domakonda) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) విద్యార్థులు సోమవారం ‘నిశముక్త్’ ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.

ఇవి కూడా చదవండి: గంజాయి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్

ఈ సందర్భంగా విద్యార్థులు “మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. మన ప్రాంతాన్ని, మన దేశాన్ని మత్తు రహితంగా మార్చాలి” అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువత వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ర్యాలీకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గట్టుమీది శంకర్ నేతృత్వం వహించారు. కళాశాల సిబ్బందితో పాటు మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ్ పాల్గొన్నారు

మరిన్ని వార్తలు