బోధనపై కలెక్టర్ ఫోకస్

28-09-2026 | 03:53pm

- విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి

- జిల్లా కలెక్టర్ అంకిత్ 

చుంచుపల్లి,(విజయక్రాంతి): చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Chunchupally Government School)ను జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, విద్యా ప్రమాణాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. కలెక్టర్ వివిధ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. పాఠ్యాంశాలపై వారి అవగాహన, అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థుల(Students)కు అందుతున్న బోధన తీరును కూడా పరిశీలించారు.

ఇవి కూడా చదవండి: దమ్మపేటలో అభివృద్ధి జోరు

ఈ క్రమంలో పదో తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. దీనిపై సరైన వివరణ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా బోధనా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధులకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్ తనిఖీ సమయంలో తహసీల్దార్ నాగరాజు, ఎంఈఓ నీరజ, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు