బస్ క్యారియర్‌పై ఓవర్‌లోడ్

14-09-2026 | 05:40am

ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

కమిషన్ కోసం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆర్‌టీసీ డ్రైవర్లు

మధిర, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): మధిర డిపో(Madhira Depot)కు చెందిన హైర్ బస్సు మధిరగోసవీడువైరా మీదుగా హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో ప్రయాణికుల లగేజీతో పాటు బస్సు లోపల, క్యారియ్ప అధికంగా బస్తాలు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉప్పలమడక, గరికపాడు, కొనిజర్ల ప్రాంతాల నుంచి గోరింటాకు, బియ్యం తదితర బస్తాలను ప్రతిరోజూ క్యారియ్ప అధికంగా తరలించడం వల్ల బస్సు వెనుక ప్రయాణించే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి వైరా బస్టాండ్లో బస్సు ఆగి తిరిగి బయలుదేరిన కొద్దిసేపటికే క్యారియ్ప ఉన్న రెండు బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. అనంతరం మరికొంత దూరం వెళ్లిన తర్వాత మరో రెండు బస్తాలు కింద పడిపోయాయి.

ఈ విషయాన్ని గమనించిన సత్తుపల్లి బస్సు డ్రైవర్ మధిర బస్సును ఆపి, బస్తాలు పడిపోయిన విషయాన్ని సంబంధిత డ్రైవర్కు సమాచారం అందించినట్లు ప్రయాణికులు పేర్కొన్నారు. అదే సమయంలో బస్సు వెనుక నుంచి కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమిషన్ల కోసమే అధిక బస్తాల తరలింపా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు క్యారియ్ప అధిక మొత్తంలో సరుకు తరలిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన లగేజీ రుసుములు సక్రమంగా చెల్లించకపోతే ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక బస్తాలను తరలించే సిబ్బందిపై అధికారులు విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రయాణికుల సమయం కూడా వృథా ప్రతి గ్రామంలో అధిక సమయం బస్తాల లోడింగ్, అన్లోడింగ్ కోసం కేటాయించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తెల్లవారు జామున సుమారు 3 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన బస్సు, ఆలస్యంగా ఎంజీబీఎస్కు చేరడంతో అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లి విధులకు హాజరయ్యే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రయాణికుల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సు క్యారియ్ప నిబంధనలకు మించి సరుకులు తరలించకుండా కఠిన పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, అనుమతించిన పరిమితిలో లగేజీ తీసుకునే ప్రయాణికుల నుంచి నిర్ణీత లగేజీ చార్జీలు వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. ముఖ్యంగా క్యారియ్ప అధిక బస్తాలు తరలించడం వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


మరిన్ని వార్తలు