చాగంటి సీతమ్మ కు నివాళులు

15-10-2026 | 04:16pm

సింగరేణి అక్టోబర్ 15 విజయ క్రాంతి: మండల పరిధిలోని కొత్త కమలాపురం గ్రామానికి(Kamalapuram Village) చెందిన సీనియర్ నాయకులు మాజీ సొసైటీ డైరెక్టర్ చాగంటి కోటయ్య తల్లి సీతమ్మ ఇటీవల  మృతి చెందారు. బుధవారం దశదిన కార్యక్రమంను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ మండల వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల నాయకులు అజ్మీర వీరన్న, మాజీ ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు ధరావత్ పాండ్యా నాయక్, సొసైటీ డైరెక్టర్ కోలేటి రాధాకృష్ణ లు పాల్గొని మృతురాలి సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా  కుమారుడైన మాజీ సొసైటీ డైరెక్టర్ చాగంటి కోటయ్య తో పాటు సోదరులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ రైతు బంధు కన్వీనర్ గుగులోతు శ్రీను నాయక్,తోటకూరి వెంకటేశ్వర్లు, కొత్త తిరుపతయ్య, దుద్దిపాళ్ళ  భాస్కరరావు, గుగులోతు హరు నాయక్, వెంకయ్య, రాజు, రామకృష్ణ  తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు