జోనల్ సైన్స్ ఫెయిర్లో విద్యార్థుల ప్రతిభ
20-11-2026 | 04:39pm
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బెల్లంపల్లిలోని TGSWRS/JC (G)లో నిర్వహించిన జోనల్ సైన్స్ ఫెయిర్ లో ఆసిఫాబాద్ విద్యార్థులు రెండు అంశాల్లో ద్వితీయ బహుమతులు సాధించారు.గణితశాస్త్రంలోని రహస్య భాష (The Secret Language of Mathematics), శక్తి వనరులు–పరిరక్షణ (Energy Sources and Conservation) అంశాల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు.
విజేతలకు జోనల్ అధికారి శారద, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ స్వాతి రమేష్ బాబు బహుమతులు అందజేశారు.ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం, సైన్స్ ఇన్స్ట్రక్టర్ ఎన్. రాజ్ కుమార్, మ్యాథ్స్ ఇన్స్ట్రక్టర్ పి. చంద్రశేఖర్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.