నాగు, ముంగిస ఫైట్.. చివరికి విషాదాంతం!
బెజ్జూర్ సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్(Bejjur) మండలంలోని నాగులవాయి గ్రామంలో ఉదయం నాగుపాము, ముంగిస మధ్య భీకర పోరు జరిగింది. రెండింటి మధ్య జరిగిన కొట్లాటలో నాగుపాము తీవ్రంగా గాయపడింది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. సహజ శత్రువులైన పాము, ముంగిసలు తరచూ పోరాడుకుంటాయి. ఈ ఘటనలో ముంగిస పలుమార్లు నాగుపాము తలను కొరికి చంపే ప్రయత్నం చేసింది.
నాగుపాము ముంగిసమధ్య గంట పాటు ఇలా పోరు జరిగింది. ఫెన్సింగ్ వైర్లు చిక్కుకోవడం తోటే పాము ఎటు కదలక బుసలు కొట్టినప్పటికీ ముంగిస మాత్రం తరచు కిందికి దిగడం పైకి ఎక్కి నాగుపామును కొరకడం పలుమార్లు చేయడంతో నాగుపాము గాయాలతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.ఫెన్సింగ్ వైర్లో చిక్కుకున్న పాము తప్పించుకోలేకపోయింది. చివరకు గాయాలతో పాము మృతి చెందినట్లు స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.