పునరావాస కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి
కెరమెరి, నవంబర్ 27 (విజయక్రాంతి):కొమరం భీమ్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్(Komaram Bheem Project Backwater) ముంపు గ్రామమైన రాంజీగూడ గ్రామస్తుల కోసం ధనోరా శివారులో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్‌తో కలిసి పునరావాస స్థలాన్ని పరిశీలించారు.
కాలనీలో చెట్ల పొదలను తొలగించి ప్లాట్లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ లైన్లు, మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడే, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ వినయ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.