జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా శశాంక్ సింగ్ నియామకం

16-10-2026 | 07:55pm

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తా: శశాంక్ సింగ్.      

జవహర్ నగర్ అక్టోబర్ 16 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా(Medchal District Bharatiya Janata Party Yuva Morcha) కార్యదర్శిగా శశాంక్ సింగ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శశాంక్ సింగ్(Shashank Singh) మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి నియామకానికి సహకరించి తనకు ప్రోత్సాహం అందించిన నాయకులకు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్(Etela Rajender), మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాగం అర్జున్, జవహర్ నగర్ బిజెపి అధ్యక్షులు కలికోట కమలాకర్ తదితరులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని యువతను పార్టీ సిద్ధాంతాల వైపు చైతన్య పరుస్తూ యువత అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని శశాంక్ సింగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు