పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్స్, షూస్ పంపిణీ

16-10-2026 | 07:53pm

పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది సేవలు అభినందనీయం: సర్పంచ్ ఆకుల భద్రప్ప

కొండపాక,అక్టోబర్ 16:( విజయ క్రాంతి)  గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది సేవలు(Services of Gram Panchayat Staff) అభినందనీయమని తిప్పారం గ్రామ సర్పంచ్ ఆకుల భద్రప్ప అన్నారు. కుక్కునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో శుక్రవారం సర్పంచ్ ఆకుల భద్రప్ప ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి ఒక జత యూనిఫామ్ దుస్తులు, సబ్బులు, నూనెలు, షూస్ అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ భద్రప్ప మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడటంలో పంచాయతీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్య పరిరక్షణకు వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. సిబ్బంది కృషిని గుర్తించి వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీశాల నవీన్, వార్డు సభ్యులు తుడుం కనకరాజు, భోగి బాబు, నేరెళ్ల చంద్రకళ, ముద్దపురం భారతమ్మ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు