దుర్గామాత పూజల్లో ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటి

16-10-2026 | 07:47pm

సత్తుపల్లి అక్టోబర్16( విజయక్రాంతి) : మండల పరిధిలోని కిష్టారం ఓసీలో(Kistharam OC) గల దేవీ నవరాత్రి ఉత్సవాల్లో(Devi Navratri festival) భాగంగా శుక్రవారం దుర్గామాత అమ్మవారిని ఐఎన్‌టీయూసీ సత్తుపల్లి(INTUC Sathupalli) ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిష్టారం ఓసీ ఫిట్ సెక్రటరీ షణ్ముఖాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని, కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు.

సింగరేణి కార్మికులందరినీ అమ్మవారు చల్లగా చూడాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.అనంతరం నిర్వహించిన సహపంక్తి భోజన కార్యక్రమం ఆయన  పాల్గొని నాయకులు, కార్మికులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ బుడిగం రామకృష్ణ, దేవదాస్,బ్రాంచ్ సెక్రటరీ మురళీకృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీ కేడం కోటేశ్వరరావు, జగదీష్, అరుణ్, సంతోష్, రాంచందర్ నాగేంద్ర, వినోద్, వెంకటేశ్వర్లు, అధిరెడ్డి వెంకటేశ్వర్లు, కొంటూ సుధాకర్, రఫూఫ్, భాస్కర్, దొంతమళ్ల శ్రీను, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు