దుర్గామాత వద్ద కుంకుమ పూజలు
సుల్తానాబాద్, అక్టోబర్ 16 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వాసవి మాత దేవాలయంలో(Vasavi Mata Temple) ఏర్పాటు చేసిన దుర్గాదేవి వద్ద శుక్రవారం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు, దేవీ నవరాత్రులు 6 రోజు అమ్మవారు అవతారం శ్రీ సరస్వతి దేవి రూపంలో అమ్మవారికి పుస్తక పూజ, అభిషేకం అలంకరణలో గాజుల మాలలు, పూలమాలలు కుంకుమార్చన పారాయణం పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దుర్గాదేవి విగ్రహ దాత కొమురవెల్లి అంజయ్య సుజాత దంపతులు, ఆలయ అర్చకులు వల్లకొండ మఠం మహేష్ , పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు పల్లా ఆపర్ణ , వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...