కడ్పల్‌ లో ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు

16-10-2026 | 08:00pm

సిర్గాపూర్ అక్టోబర్ 16(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా కడ్పల్ లో శుక్రవారం నాడు అట్ల బతుకమ్మ వేడుకలను(Bathukamma Celebration) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.

పండుగ వాతావరణంతో ప్రాంతమంతా సందడిగా మారింది. అట్ల బతుకమ్మ ప్రత్యేకతను చాటుతూ మహిళలు అట్లను నైవేద్యంగా సమర్పించి గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో(devotional) పూజలు చేశారు. కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ వేడుకలు తెలంగాణ మహిళల ఐక్యతకు, మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచాయి. బతుకమ్మ పండుగ ద్వారా భావితరాలకు తెలంగాణ సంప్రదాయాల గొప్పతనాన్న తెలియజేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు