క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి
చేగుంట అక్టోబర్ 16,విజయక్రాంతి: చేగుంట మండలంలోని చిటోజిపల్లి గ్రామంలో(Chitojipalli Village) దసరా సందర్బంగా గ్రామ యూవకులు సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్(Cricket Tournament) నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా , బి,కొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రాజిరెడ్డి, హాజరై టోర్నమెంటు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూవత చెడు అలవాటుకు దూరంగా ఉంటూ, శరీర మానసిక ఉల్లాసానికి క్రీడలు ఉపయోగించుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు, ఈ కార్యక్రమం లో డిష్ రాజు, చేగుంట మహంకాళి ఆలయం ఉపాధ్యక్షుడు గుండ్ల సంపత్ కుమార్, గ్రామ సర్పంచ్ లక్ష్మీ నరసయ్య, నరేష్, రవి, సంపత్, సాయి తదితరులు పాల్గొన్నారు.