అనురాగ్ లో బతుకమ్మ పండుగ వేడుకలు
ఘట్ కేసర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అనురాగ్ యూనివర్సిటీ(Anurag University) సీఈఓ ఎస్. నీలిమ(Neelima) ఆధ్వర్యంలో శుక్రవారం అనురాగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా అధ్యాపకులు(Female faculty members), మహిళా ఉద్యోగులు, విద్యార్థినీలు సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహిళలందరూ కలిసి గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో ఆకర్షణీయమైన బతుకమ్మలను పేర్చారు. అనంతరం వలయాకారంలో నిలబడి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో ప్రాంగణమంతా ఆనందోత్సాహాలను నింపారు. సీఈఓ, ఉపకులపతి వంటి ఉన్నతాధికారుల నుంచి సహాయక సిబ్బంది వరకు అందరూ విద్యార్థినులతో కలిసి ఒకే వరుసలో నిలబడి బతుకమ్మ ఆడటం అనురాగ్ యూనివర్సిటీ ప్రత్యేకతను చాటిచెప్పింది.ఈవేడుక తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటడమే కాకుండా, అనురాగ్ కుటుంబ సభ్యుల ఐక్యతను, పరస్పర సాన్నిహిత్యాన్ని, పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించింది.