కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
15-10-2026 | 04:57pm
లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ అందజేత
ఆసిఫాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ అన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సందీప్నగర్లో లబ్ధిదారు కిరూముల మమతకు ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రొసీడింగ్స్ అందుకున్న మమత సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్పీ రమ, రాధా, దీపిక, కాలనీవాసులు పాల్గొన్నారు.