బస్టాండ్లో స్వచ్ఛత కార్యక్రమం

08-10-2026 | 07:44pm

పెంచికలపేట(విజయక్రాంతి): మండల కేంద్రములోని ఎల్కపల్లి గ్రామ బస్టాండ్‌(Elkapalli Bus Stand)లో గత కొంతకాలంగా ఉపయోగంలో లేని మరుగుదొడ్లను గ్రామ పంచాయతీ(Gram Panchayat) ఆధ్వర్యంలో శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు, ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు, ఉపయోగంలో లేని మరుగుదొడ్లను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో శుభ్రం చేసినట్లు సర్పంచ్ భక్తు రాంచందర్ తెలిపారు 

ఈ సందర్భంగా  రాంచందర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజా ప్రదేశాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఉపయోగంలో లేని మరుగుదొడ్ల(Toilets)ను శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వాటిని పరిశుభ్రంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామ పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని, ప్రజలు కూడా గ్రామ పంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు పారిశుధ్య సిబ్బంది కలిసి శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు