పశుగ్రాసం సాగుతో రైతులు లబ్ధి పొందాలి

28-10-2026 | 08:33pm

ఆసిఫాబాద్, (విజయక్రాంతి):వీబీజీ రామ్ జీ పథకం(VBG Ramji Scheme) కింద రైతులు పశుగ్రాసం సాగు చేసి ఆర్థికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)(Minister Danasari Anasuya (Seethakka)) అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లోనే ఉపాధి పనులు కల్పించి వలసలను నివారించాలని, గ్రామీణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

పశుగ్రాసం సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.14 వేల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.కలెక్టరేట్ నుంచి పాల్గొన్న అదనపు కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ జిల్లాలో పశుగ్రాసం సాగును ప్రోత్సహించడంతో పాటు నీటి సంరక్షణ పనులు, గ్రామీణ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు