ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవోకు భారీ మద్దతు
ఒకేసారి 15 మంది ఉద్యోగుల సభ్యత్వ నమోదు
హాజీపూర్ ( విజయక్రాంతి ) : మంచిర్యాల జిల్లా(Mancherial District) హాజీపూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో(MPDO Office) టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం(TNGO Membership Registration Program) జోరుగా సాగింది. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి(Gadiyaram Srihari) ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖకు(Panchayat Raj) చెందిన 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు(Non-gazetted employees) టీఎన్జీవోలో సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే టీఎన్జీవో ప్రధాన లక్ష్యమని, జిల్లాలోని అన్ని యూనిట్లలో సభ్యత్వ నమోదు పూర్తి చేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, నరేందర్, నాగుల గోపాల్, అజయ్, సుమన్‌తో పాటు పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.