గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గిరిజన పోరాట యోధులు కుమురం భీం(Kumuram Bheem), ఎడ్ల కొండు జన్మస్థలమైన రౌటసంకేపల్లిలో ఈ నెల 22న నిర్వహించనున్న జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని రాజ్ గోండ్ సేవా సమితి(Raj Gond Seva Samiti), పంచాయతీ రాయి సెంటర్, గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ నీతిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్ దాస్ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.
గిరిజన పోరాట యోధుల చరిత్ర, త్యాగాలను స్మరించుకుంటూ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమురం భీం కుటుంబ సభ్యులు కుమురం సీతారాం, రాము, వెంకటేష్, ఎడ్ల కొండు వారసుడు ఎడ్ల బక్కయ్య, కొలం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీమ్రావు, ఆర్జేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మడావి గుణవంతరావు, కార్యనిర్వాహక వైస్ చైర్మన్ వై. రాజేష్, కొమురం పాండు, ఆత్రం షేక్ తదితరులు పాల్గొన్నారు.