ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం
18-10-2026 | 02:05pm
KVPS జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్
ఆసిఫాబాద్(విజయక్రాంతి): గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని KVPS జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. పౌర హక్కుల దినోత్సవం నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అక్కడక్కడ కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. గ్రామస్థాయిలో ప్రజలకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించాలని, వివక్షకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.