అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

18-10-2026 | 03:52pm

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

గణపురం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపం వద్ద భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు