గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ భరోసా..
మఠంపల్లి అక్టోబర్ 18 (విజయక్రాంతి): సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్, యూనిఫామ్లు రూ.1,000 నగదును మండలంలోని కృష్ణ తండా సర్పంచ్ బానోతు రమాదేవి శంకర్ నాయక్(Sarpanch Banoth Ramadevi Shankar Naik) అందజేశారు. దసరా పండుగను పురస్కరించుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సర్పంచ్ రమాదేవి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సిబ్బందికి ఇన్సూరెన్స్ సదుపాయంతో పాటు యూనిఫామ్లు, నగదు అందజేశారు.
సిబ్బందికి ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి సేవలను గుర్తించి గౌరవించడం పట్ల గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత పరిరక్షణతో పాటు ప్రజలకు నిరంతరం సేవలందించే గ్రామ పంచాయతీ సిబ్బంది కృషి ఎంతో విలువైనదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంబయ్య, వార్డు సభ్యులు నాగమణి, శ్రీనునాయక్, నాగునాయక్,నారాయణ నాయక్, ప్రవళిక, పరమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది సంక్షేమమే గ్రామ అభివృద్ధికి బలమనే సందేశంతో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది.