భీం వర్ధంతిని విజయవంతం చేయాలి

18-10-2026 | 04:00pm

ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపు

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్యదైవం, జల్‌–జంగల్‌–జమీన్‌ కోసం పోరాడిన అమరజీవి కుంరం భీం 86వ వర్ధంతి వేడుకను ఈనెల 26న జోడేఘాట్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Laxmi) తెలిపారు. ఈ సందర్భంగా వర్ధంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.

ఈనెల 25న అవ్వల్ పెన్ పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26న ఉదయం 8 గంటలకు జెండా ఆవిష్కరణ, 9 గంటలకు సమాధి పూజ, 10 గంటలకు కుంరం భీంకు శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు పేర్కొన్నారు. కుంరం భీం ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆదివాసీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుంరం భీం మనవడు కుంరం సోనే రావుతో పాటు పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు