క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆడబిడ్డలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Laxmi) ఆకాంక్షించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడి దశాబ్ది పూర్తి చేసుకుంటున్న తరుణంలో జిల్లాలో రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు(State-level netball competitions) నిర్వహించడం గర్వకారణమన్నారు.జిల్లాల ఏర్పాటు లక్ష్యం అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడమేనని, ఆ దిశగా ఇలాంటి క్రీడా పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో శనివారం 9వ సబ్‌జూనియర్ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్(9th Sub-Junior State Level Netball Championship) పోటీలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పోటీలు అక్టోబర్ 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారిణులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.