వ్యవసాయ విద్యుత్ సరఫరాపై క్షేత్రస్థాయి పరిశీలన

16-10-2026 | 06:00pm

బెజ్జూర్ అక్టోబర్ 16 (విజయ క్రాంతి): బెజ్జూర్ సెక్షన్ పరిధిలోని కృష్ణ పల్లి  గ్రామంలోని వరి పొలాలను ఎస్‌ఈ ఆపరేషన్స్ జాడే ఉత్తమ్(SE Operations Jade Uttam) సందర్శించారు. రైతులతో వ్యవసాయ విద్యుత్ (AGL) సరఫరా పరిస్థితిపై నేరుగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పంటల సాగుకు అవసరమైన నీరు సమృద్ధిగా అందుబాటులో ఉందని, విద్యుత్ సరఫరా పరంగా ఎలాంటి సమస్యలు లేవని అధికారులు గుర్తించారు.

టాంగ్ టెస్టర్ ద్వారా విద్యుత్ లోడ్‌ను, వోల్టేజీలను పరిశీలించగా అవి సంతృప్తికరంగా ఉన్నట్లు నిర్ధారించారు.ప్రస్తుతం అందుతున్న వ్యవసాయ విద్యుత్ సరఫరాపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ సిర్పూర్-కాగజ్‌నగర్, బెజ్జూర్ ఏఈ అంజల్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు