ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు కళాజాత కార్యక్రమం
24-11-2026 | 10:14am
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ అభ్యాసకులకు ఈ నెల 25న జనకాపూర్ రైతు వేదిక(Janakapur Raithu Vedika)లో కళాజాత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ హాజరుకానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈఓ, డీఆర్‌డీఏ అధికారులు పాల్గొననున్నారు. గతంలో ఉత్తీర్ణులైన, ఫెయిలైన, ఏప్రిల్‌లో పరీక్షలు రాయనున్న అభ్యాసకులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి, కోఆర్డినేటర్లు కోరారు.