చందాయిపేటలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

24-11-2026 | 10:15am

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం(Chegunta mandal)లోని చందాయిపేట గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని(Indiramma Bima Scheme) ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఇందిరమ్మ బీమా పథకం ప్రాధాన్యత, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు